హైదరాబాద్ ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): హైకోర్టు సీనియర్ న్యాయవాది కే ప్రతాప్‌రెడ్డి (94) అనారోగ్యంతో బాధపడుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వరంగల్ జిల్లా పోతుగల్ గ్రామంలో 1931 ఏప్రిల్ 11న ఆయన జన్మించారు. ప్రతాప్‌రెడ్డి జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యు డు. ఆ పార్టీ ఎంపీగా కూడా పోటీ చేశారు.
ఉమ్మడి ఏపీ బార్‌కౌన్సిల్ సభ్యుడిగా, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. విద్యాసంస్థలను నెలకొల్పి విద్యాదానం చేశారు. ఆయన వద్ద దాదాపు 200 మంది న్యాయవాదులు జూనియర్లుగా పనిచేశారు. అలా పనిచేసిన వారిలో కొందరు హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా సైతం నియమితులయ్యారు.