హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): త్వరలో నిర్వహించే బోర్డు మీటింగ్కు ఎజెండా అంశాలను పంపాలని తెలుగు రాష్ర్టాలకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కోరింది. ఈ మేరకు బోర్డు మెంబర్ సెక్రటరీ ఎస్కే కాంబోజ్ గురువారం ఇరు రాష్ర్టాలకు లేఖలు రాశారు.
జనవరిలో 21వ బోర్డు సమావేశాన్ని నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ నెలాఖరులోగా ఎజెండా అంశాలను పంపాలని సూచించారు.