ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు సెమీ హైస్పీడ్ రైలు నెట్వర్క్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. రాజధానితో ద్వితీయ శ్రేణి నగరాలను వేగంగా అనుసంధానించటానికి ఉన్న అవకాశాలపై కూడా అధ్యయనం చేపట్టనున్నది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, నగరాల్లో టీఎస్ బీపాస్ విజయవంతంగా అమలు చేస్తున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీల్లో భవన నిర్మాణ అనుమతులను కూడా టీఎస్‌బీపాస్ పరిధిలోకి తేవాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో చేయబోయే పనులు, ప్రణాళిక వివరాలను మున్సిపల్ శాఖ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. శుక్రవారం మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు విడుదల చేసిన నివేదికలోని ముఖ్యాంశాలు..
– హైదరాబాద్, నమస్తే తెలంగాణ