Selfiee | హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : ఏపీలోని విజయవాడ రూరల్ మండలం పాతపాడులో ఐదుగురు స్నేహితులు మద్యం సేవించి చేపల చెరువు వద్దకు వెళ్లారు. నాటుపడవ ఎకి సెల్ఫీలు దిగుతుండగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో శివానంద్ (23), రవికుమార్ (21) మృతిచెందగా మరో ముగ్గురిని స్థానికులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : ఏపీలోని చిత్తూరు నగరం బంగారురెడ్డిపాలేనికి చెందిన సతీశ్, రాధిక కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చిన వీరు శుక్రవా రం తిరుమలలో 450వ శ్రీవారి మెట్టు వద్ద పురుగుల మందు తాగారు. గమనించిన భక్తులు టీటీడీ సెక్యూరిటీకి స మాచారం అందించడంతో వారు ప్రేమజంటను దవాఖానకు తరలించారు. ఆత్మహత్యకు కారణం తెలియరాలేదు.