ఖానాపురం, జూలై 16 : రాష్ట్ర ప్రభుత్వం గత యాసంగిలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు కేటాయించింది. ఈ ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసి బియ్యాన్ని ఎఫ్‌సీఐకి పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే గత నెల నుంచి కేంద్ర ప్రభుత్వం బియ్యం సేకరణను నిలిపివేసింది. దీంతో వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లోని శ్రీ దత్తసాయి ఇండస్ట్రీస్ రైస్‌మిల్లులో నిల్వచేసిన 8 వేల బస్తాల ధాన్యం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తడవడంతో మొలకలొచ్చాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బియ్యం కొనుగోళ్లను చేపట్టాలని రైస్ మిల్లర్లు కోరుతున్నారు.