రూ1.22 కోట్ల హవాలా నగదు పట్టివేత
దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైల్లో ముంబై నుంచి సికింద్రాబాద్‌కు హవాలా నగదు తరలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకొని, అతని వద్ద నుంచి రూ.1,22 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ ఆవరణలో రైల్వే డీఎస్పీ జావేద్, ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్ వివరాలు వెల్లడించారు.
- దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో తరలిస్తుండగా స్వాధీనం
మారేడ్‌పల్లి, మే 27: దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైల్లో ముంబై నుంచి సికింద్రాబాద్‌కు హవాలా నగదు తరలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకొని, అతని వద్ద నుంచి రూ.1,22 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ ఆవరణలో రైల్వే డీఎస్పీ జావేద్, ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్ వివరాలు వెల్లడించారు.
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా, సాయినగర్‌కు చెందిన విజయ్ అంబదాస్ గుప్తా(40) ముంబైలోని కాంతా జ్యువెలరీ నిర్వాహకుడు సంతోష్ సేఠ్ సూచన మేరకు 1,22,70,000 మోండా మార్కెట్లోని జ్యువెలరీ వ్యాపారం నిర్వహిస్తున్న బండి అనే వ్యక్తికి నగదు అప్పగించాల్సి ఉందని తెలిపారు. ఈ క్రమంలో బుధవారం దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా విజయ్ అంబదాస్ గుప్తా అనుమానాస్పదంగా లగేజీ బ్యాగ్‌తో ప్రయాణం చేస్తూ కనిపించాడు.
దీంతో పోలీసులు అతడిని తనిఖీ చేయగా నగదు లభ్యమైంది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా నగదుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు, అనుమతులు లేకపోవడంతో హవాలా నగదుగా గుర్తించి స్వా ధీనం చేసుకొని ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

