Congress | గద్వాలలో కాంగ్రెస్ వర్గ విభేదాలు.. అధిష్ఠానంపై సీనియర్లు సీరియస్
Congress | గద్వాలలో కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన జోగుళాంబ గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరితకు చుక్కెదురవుతున్నది. సరితకు టికెట్ ఇవ్వొద్దంటూ నాలుగు రోజుల కిందట గద్వాలలో జరిగిన కార్యకర్తల సమావేశంలో డిమాండ్ చేశారు.
Congress | గద్వాల, ఆగస్టు 18: గద్వాలలో కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన జోగుళాంబ గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరితకు చుక్కెదురవుతున్నది. సరితకు టికెట్ ఇవ్వొద్దంటూ నాలుగు రోజుల కిందట గద్వాలలో జరిగిన కార్యకర్తల సమావేశంలో డిమాండ్ చేశారు. ఇది మరువక ముందే.. సరిత అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేతలు మరోసారి అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో ‘తిరగబడదాం.. తరిమికొడదాం’ కార్యక్రమానికి సరితను కోఆర్డినేటర్‌గా నియమించడంతో కాంగ్రెస్ నేతల మధ్య భేదాభిప్రాయాలు బయటపడ్డాయి. ఆమెను కోఆర్డినేటర్ పోస్టు నుంచి తొలగించాలని డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్‌రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి, ప్రచార కమిటీ సభ్యుడు కుర్వ విజయ్‌కుమార్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీరబాబు శుక్రవారం హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రేను కలిసి వినతిపత్రం అందజేశారు. సీనియర్ నాయకులకు తెలియకుండా సరితకు పదవిని ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తున్నది. ఆమె పదవిని రద్దు చేయకపోతే భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచిస్తామని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

