హైదరాబాద్, జూన్7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లకు సంబంధించి రెండో జాబితా విడుదల చేశారు. సొసైటీ కార్యదర్శి సైదులు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎంపికైన విద్యార్థుల జాబితా ఆన్లైన్ https://mjpabcwreis.cgg.gov.in/లో అందుబాటులో ఉందని తెలిపారు.
21,920సీట్లకు మొదటి విడుతలో 10,562మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో చేరారని పేర్కొన్నారు. మిగతా సీట్ల భర్తీకి రెండో జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని తెలిపారు. విద్యార్థులు వారికి కేటాయించిన కాలేజీలో ఈనెల 14లోగా రిపోర్ట్ చేయాలని కార్యదర్శి సైదులు స్పష్టం చేశారు.