‘పురపోరు’కు ఎస్ఈసీ కసరత్తు..
ఎస్ఈసీ | తెలంగాణలో పట్టణ, స్థానిక ఎన్నికలకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఖాళీ అయిన పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నది.

హైదరాబాద్ : తెలంగాణలో పట్టణ, స్థానిక ఎన్నికలకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఖాళీ అయిన పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. వరంగల్, ఖమ్మం, అచ్చంపేట పాలకమండళ్ల పదవీకాలం పూర్తికావడంతో ఇప్పటికే ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. సిద్దిపేట మున్సిపాలిటీ పాలకమండలి గడువు ఈ నెల 15న ముగియనుంది. కొత్తగా ఏర్పాటైన కొత్తూరు సహా జడ్చర్ల, నకిరేకల్ మున్సిపల్‌కు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీకి ఇప్పటికే ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేశారు.
పోలింగ్ కేంద్రాల గుర్తింపునకు సైతం షెడ్యూల్ ప్రకటించారు. మరో ఎనిమిది మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు షెడ్యూల్ జారీ అయ్యింది. బుధవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదాను ఎన్నికల కమిషన్ తయారు చేయనుంది. గురువారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా ప్రకటించనున్నారు. ఈ నెల 11 వరకు అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారాలు చేపట్టనున్నారు. ఈ నెల 14న పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటించనున్నారు. కొనసాగుతున్న ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ ఏర్పాట్లపై బుధవారం కలెక్టర్లు, అధికారులతో ఎస్ఈసీ పార్థసారధి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకూ..
అలాగే గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎన్నికలు నిర్వహించాల్సిన, ఖాళీగా ఉన్న వివిధ స్థానిక సంస్థల పదవులకూ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధమైంది. ఈ మేరకు సంబంధిత ప్రక్రియను సైతం ప్రారంభించింది. ఓ జడ్పీటీసీతో పాటు 60 ఎంపీటీసీ, 125 సర్పంచ్ స్థానాలు, 2288 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఆయా స్థానాల్లో వార్డుల వారీ ఓటర్ల తయారీకి ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈనెల 12వ తేదీన ఓటర్ల తుది జాబితాలు ప్రకటించనుంది. ఆ తర్వాత పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసి ఆ తర్వాత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
ఇవికూడా చదవండి..
జైలుపై దాడి.. 1800 మంది ఖైదీలు పరారీ
ఆస్ట్రాజెనికా టీకా.. బ్లడ్ క్లాటింగ్‌కు లింకు నిజమే..
ఇంటి కొనుగోలుకు ప్రీ అప్రూవ్డ్ లోన్‌తో బోలెడు బెనిఫిట్లు!
సీబీఐ విచారణ రద్దు చేయండి.. సుప్రీంకు అనిల్ దేశ్‌ముఖ్
వచ్చే 4 వారాలు కీలకం
నీతి ఆయోగ్‌లో నల్లగొండవాసి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

