హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): చాలాకాలం తర్వాత ఒక రిమోలియన్ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సంపాదించాడు. డెహ్రాడూన్లోని ప్రతిష్టాత్మక రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (ఆర్ఐఎంసీ)లో చదివిన విద్యార్థులను రిమోలియన్స్గా పిలుస్తారు. నగరానికి చెందిన చేపూరి అవినాష్ తన 13వ ఏట రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీలో ప్రవేశం పొందా డు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాతపరీక్ష ద్వారా ఇంటర్వ్యూకు ఎంపికయ్యాడు.
అక్కడ చదువు, శిక్షణ అనంతరం 2024లో మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందాడు. 2017లో ఉత్తరాఖండ్ స్టేట్ చాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ గెలవడం నుంచి, 2023లో తెలంగాణ చీఫ్ మినిస్టర్ కప్లో సిల్వర్ మెడల్ అందుకోవడం వరకు అవినాష్ అనేక పతకాలను గెలుచుకున్నాడు. 2019లో ఆర్ఐఎంసీ నుంచి మెరిట్ కార్డ్ మరియు హాఫ్-బ్లూ పురసారాలను అందుకున్నాడు. జాతీయస్థాయిలో 2021 నార్త్ జోన్ ఎయిర్ రైఫిల్ షూటింగ్ చాంపియన్షిప్లో జూనియర్, యూత్ కేటగిరీల్లో నేషనల్ చాంపియన్ షిప్కి అర్హత సాధించాడు. 2022, 2023లో 65వ, 66వ నేషనల్ షూటింగ్ చాంపియన్ షిప్లలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించి నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఎఐ) నుంచి ‘రినౌన్డ్ షాట్’ గా అర్హత పొందాడు.