హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ఇరవై రెండు హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నెల 29న సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని మంగళవారం టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక జాబితాలను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచినట్టు సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. ఈ ఉద్యోగాల భర్తీకి 2022లో నోటిఫికేషన్ విడుదల చేసి, నిరుడు జూన్ 17న రాత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.