Vizianagaram Train Accident | కంటకాపల్లి రైలు ప్రమాదం.. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ సహా పలు రైళ్లు రద్దు
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కంటకాపల్లి (Kantakapally) వద్ద ప్రమాదం నేపథ్యంలో ఆ మార్గం గుండా వెళ్లాల్సిన పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (SCR) రద్దుచేసింది. హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (12703), హౌరా-బెంగళూరు దురంతో ఎక్స్‌ప్రెస్ (12245)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కంటకాపల్లి (Kantakapally) వద్ద ప్రమాదం నేపథ్యంలో ఆ మార్గం గుండా వెళ్లాల్సిన పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (SCR) రద్దుచేసింది. హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (12703), హౌరా-బెంగళూరు దురంతో ఎక్స్‌ప్రెస్ (12245), షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ (18045), చెన్నై-హౌరా ఎక్స్‌ప్రెస్ (12840) రైళ్లు ఉన్నాయి. వీటితోపాటు విశాఖపట్నం-గుణుపూర్, విశాపట్నం-రాయగడ, విశాఖపట్నం-పలాస ప్యాసింజర్ రైళ్లను కూడా రద్దుచేసినట్లు అధికారులు తెలిపారు.
ఆదివారం రాత్రి విజయనగరం (Vizianagaram Train Accident) జిల్లాలోని కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద ఒకే ట్రాక్‌పై ఆగిఉన్న రైలును మరో రైలు ఢీకొట్టింది. విశాఖపట్నం నుంచి బయలుదేరిన విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలు ఓవర్ హెడ్ విద్యుత్తు వైర్లు తెగిపోవడంతో పట్టాలపై ఆగిపోయింది. ఆగి ఉన్న ఈ ప్యాసింజర్ రైలును పలాస-విశాఖ ఎక్స్‌ప్రెస్ వెనుక నుంచి ఢీకొన్నది. దీంతో రాయగడ ప్యాసింజర్ రైలు చివరి మూడు భోగీలు పట్టాలు తప్పాయి. అవి ఎదురుగా వస్తున్న గూడ్స్ ఇంజిన్‌ను ఢీకొట్టాయి. దీంతో ఘటనా స్థలిలో భీతావహ పరిస్థితి నెలకొన్నది. ఈ ప్రమాదం ఇప్పటివరకు 16 మంది మరణించారు. వారిలో ఇద్దరు లోకోపైలట్లు, గార్డు కూడా ఉన్నారు. మరో 100 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

