హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): సోమవారం నుంచి ప్రారంభంకావాల్సి ఉన్న బడిబాట వాయిదాపడింది. డీఈవోలు ఎంఈవోలు, టీచర్లకు బడిబాట వాయిదాపడిందని ఆదివారం వాట్సాప్ సందేశాలు పంపించారు. కొత్త షెడ్యూల్ను త్వరలోనే ప్రకటిస్తామని సందేశంలో పేర్కొన్నారు. అధికారిక సమాచారం ప్రకారం ఈ నెల 10 నుంచి 25వరకు నిర్వహించే అవకాశాలున్నాయి.