హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని ఓ పాఠశాల ఒక్క ఏడాది చదువుకు అక్షరాలా రూ. 24 లక్షల ఫీజు వసూలు చేస్తుంది. ఈ పాఠశాలలో ప దేండ్లు పూర్తయ్యే సరికి అయ్యే ఫీజు మొత్తం 2.4కోట్లు. తెలంగాణలోని ప్రైవేట్ స్కూళ్లల్లో వసూలు చేస్తున్న ఫీజుల్లో ఇదే అత్యధికం. ఇంటర్నేషనల్ బ్రాండ్ పేరుతో ఈ స్కూల్ ఫీ జుల మోత మోగిస్తున్నది. ఇలా రాష్ట్రంలోని మరికొన్ని స్కూళ్లు వసూలు చేస్తున్న ఫీజుల మొత్తాన్ని వింటే గుండెలు గుబిళ్లుమనడం ఖాయం. మన దగ్గర ఎంబీబీఎస్ బీ క్యాటగి రీ సీటు ఫీజు 15లక్షలుండగా, సదరు పాఠశాలలో ఫీజు 24లక్షలు వసూలు చేస్తుండటం గమనార్హం. హైదరాబాద్‌లో 120కి పైగా పాఠశాలలు అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి.
ఈ పాఠశాలల్లో ఫీజులు ఐదారు లక్షలకు మించి ఉన్నాయి. ఇవి చాలవంటూ లంచ్, స్నాక్స్‌కు, ట్రాన్స్‌పోర్టు ఫీజులు రూ. 50 నుంచి లక్ష వరకున్నాయి. రాష్ట్రంలో 10వేలకు పైగా ప్రైవేట్ పాఠశాలలున్నాయి. ఫీజుల దందాకు చెక్‌పెట్టే లక్ష్యంతో విద్యాకమిషన్ ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కొత్త విద్యాసంవత్సరం సమీపిస్తున్నది. ఇప్పటికే పలు పాఠశాలల్లో అడ్మిషన్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురాబోతున్నది. ఈ నేపథ్యంలో ఫీజుల కట్టడి సాధ్యమేనా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గ్రేటర్‌లోని పలు స్కూళ్ల ఫీజు ఇలా..