బాన్సువాడ, జూలై 11: ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినిని లైంగికంగా వేధించిన ఘటన బయటకు పొక్కకుండా గ్రామ పెద్దలు రాజీ కుదిర్చారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో చోటుచేసుకున్న ఈ ఉ దంతం ఆలస్యంగా వెలుగు చూ సింది. దీంతో ఉపాధ్యాయుడు సహా పది మందిపై పోలీసులు కేసు నమో దు చేశారు.
గురువారం బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం.. బాన్సువాడ మండలంలోని ఓ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు.. అదే పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించా డు. ఈ ఘటన బయటకు పొక్కకుం డా స్థానికులు కొందరు మధ్యవర్తులుగా వ్యవహరించి.. ఉపాధ్యాయుడికి, బాలిక తల్లిదండ్రులకు మధ్య రాజీ కుదిర్చారు.
తాజాగా ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సహకారంతో బాధితురాలితో పాటు ఆమె తల్లిదండ్రులతో మాట్లాడగా, లైంగిక వేధింపులు నిజమేనని తేలింది. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడితోపాటు రాజీ కుదిర్చిన తొమ్మిది మధ్యవర్తులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.