హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్‌లకు స్కూల్ గ్రాంట్ నిధులను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా (ఐదు స్లాబ్‌లుగా) రూ.10 వేల నుంచి రూ.లక్ష నిధులు విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ నిధులను స్టేషనరీ సహా ఇతర అవసరాలకు వాడుకోవాలని సూచించింది.
సర్కారు స్కూళ్లల్లో స్టూడెంట్ కౌన్సిల్
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): సర్కారు బడుల్లో హెడ్ బా య్, హెడ్ గర్ల్ విధానాన్ని ప్రవేశపెట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. 25 మంది విద్యార్థులతో స్టూడెంట్ కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ మంగళవారం మార్గదర్శకాలు విడుదల చేశారు.