సిటీబ్యూరో, జూన్ 7 ( నమస్తే తెలంగాణ): ప్రభుత్వ, పైవేట్ విద్యా సంస్థల్లో తొమ్మిదో తరగతి నుంచి ఆ పై చదివే ట్రాన్స్ జెండర్స్ ‘ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ట్రాన్స్జెండర్స్ 2024-25’కి ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ గిగ్ వర్కర్స్ యూనియన్ సంస్థ ఫౌండర్ షేక్ సలావుద్దీన్ శుక్రవారం ఒక ప్రకటనో పేర్కొన్నారు.
గత ఏడాది తరగతిలో 50 శాతం మార్కులు ఉండి, వార్షిక ఆదాయం ఏడాదికి రూ.లక్ష మించి ఉండనివారికి స్కాలర్షిప్ రూ.40వేల వరకు అందించనున్నట్టు చెప్పా రు. సమాచారం కోసం సెల్ నంబర్ 96424 24799 సంప్రదించాలని సూచించారు.