న్యూఢిల్లీ: బ్యాంకింగ్ సేవలు, సంక్షేమ పథకాలు వంటివాటిని దివ్యాంగులు పొందడానికి వీలుగా డిజిటల్ కేవైసీ ప్రక్రియలో మార్పులు చేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. యాసిడ్ దాడుల బాధితులు, దృష్టి సంబంధిత వైకల్యాలతో బాధపడేవారికి అనుకూలంగా ఈ మార్పులు ఉండాలని తెలిపింది.
భారతీయ రిజర్వు బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం, దానిలోని డిపార్ట్మెంట్లకు ఈ ఆదేశాలను జారీ చేసింది. జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కులలో ముఖ్యమైన భాగంగా డిజిటల్ యాక్సెస్ హక్కు ఆవిర్భవించిందని తెలిపింది.