హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ద్వారా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఎస్సీ అభ్యర్థులకు రిజర్వేషన్ వర్తిస్తుందని బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఏపీపీ పోస్టులకు ఈ నెల 12 నుంచి అక్టోబర్ 5 సా॥ 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు.
రిజర్వేషన్ కోసం ఎస్సీ క్యాటగిరీ అభ్యర్థులు తప్పనిసరిగా ఈ ఏడాది ఏప్రిల్ 14 తర్వాత ప్రభుత్వం జారీచేసిన కమ్యూనిటీ సర్టిఫికెట్ను అప్లోడ్ చేయాలని తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో తప్పనిసరిగా కొత్త క్యాస్ట్ సర్టిఫికెట్ సమర్పించాలని చెప్పారు.