హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): ఐదుగురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. టీకే శ్రీదేవిని ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా నియమించింది. ఏఏఎం రిజ్వీకి వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిం ది. శ్రీనివాస్‌రెడ్డిని మార్క్‌ఫెడ్ ఎండీగా, ఎస్ హరీశ్‌ను రెవెన్యూ శాఖ సంయుక్త కార్యదర్శిగా, చంద్రశేఖర్‌రెడ్డిని హాకా ఎండీగా, ప్రియాంకను పురపాలక శాఖ డిప్యూటీ సెక్రటరీగా, వికాస్‌రాజ్‌ను రవాణాశాఖకు బదిలీ చేసింది.
డిప్యూటీ కలెక్టర్లుగా 9 మంది తహసీల్దార్లు
హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం 9మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించింది. సీహెచ్ రామ్మూర్తి, టీ వెంకటేశం, కే సుశీల, ఎం జయమ్మ, ఏ యాదగిరి, ఎన్ నిర్మల, ఎల్ సుధ, సీహెచ్ విశాలక్ష్మి, బీ గీతకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.