హైదరాబాద్, జూన్10 (నమస్తే తెలంగాణ): జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ఎస్సీ, ఎస్టీ గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. ఈ ఏడాది అడ్వాన్స్డ్ పరీక్షకోసం 400 మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించారు. వీరిలో ఏకంగా 47మందికి పైగా విద్యార్థులు డైరెక్ట్ ర్యాంకులు సాధించగా, మరో 130 మంది విద్యార్థులు ప్రిపరేటరీ ర్యాంకులు సాధించడం విశేషం. అందులో 34మంది విద్యార్థులు 1000లోపు ర్యాంకులు సాధించడం గర్వకారణం. ఇందులో మహేశ్వరి107, అభిషేక్144, అంజలి 224, సూర్యకుమారి226, అఖిల233 ర్యాంకును సాధించారు. ఇక, చెంచు కమ్యూనిటీకి చెందిన శివశంకర్1419 ర్యాంకు సాధించారు. ప్రతిభ చూపిన విద్యార్థులను ఆయా సొసైటీల సెక్రటరీలు సీతాలక్ష్మీ, డాక్టర్ శరత్‌లు ప్రత్యేకంగా అభినందించారు.