హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ఐటీ ఉద్యోగులను అవమానకరంగా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని రెడో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉన్నత చదువులతో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న వారిని తూలనాడటం తగదని హితవు పలికారు. ‘కంప్యూటర్ మీద పనిచేసే వాళ్లు వరర్స్ మాత్రమే అంటూ.. ఐటీ ఉద్యోగులను కించపరిచేలా దావోస్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటని పేర్కొన్నారు.
సీఎం హోదాలో ఉండి ఒక అంతర్జాతీయ వేదికపై ఇలా మాట్లాడటం.. రాష్ట్రం పరువు తీయడమేనని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ చదివేవాళ్లు, ఐటీ ఉద్యోగులు డ్రగ్స్ అమ్ముతున్నారంటూ గతంలో మాట్లాడారని, ఇంజినీర్ల కంటే మేస్త్రీలు ఎకువ సంపాదిస్తున్నారంటూ చలకనగా మాట్లాడారని తెలిపారు. తరచూ విద్యావంతులను తకువ చేసి మాట్లాడటం రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ప్రపంచం ముందు తెలంగాణ ఠీవిగా నిలబడిదంటే అది ఐటీ చలవేనని పేర్కొన్నారు.