హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): సర్పంచ్లకు పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా తో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అడ్డదారు లు తొకి అధికారంలోకి వచ్చిందని, పాలనలో విఫలమైందని ధ్వజమెత్తారు. సర్పంచ్లు దవాఖానల్లో ఉండి, డబ్బులు లేక ఏడుస్తున్నారని పేర్కొం టూ.. బాకీ ఉన్న నిధులన్నీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్25 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని 48 చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.10.18కోట్లతో పరిపాలన అనుమతులను మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పుల్కల్లో 23 చెరువుల అభివృద్ధికి రూ.4.96 కోట్లు, చౌట్కూర్లో 25 చెరువుల అభివృద్ధికి రూ.5.21 కోట్లను మంజూరు చేసింది.