హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తండాల్లో సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఎల్‌హెచ్‌పీఎస్ (లంబాడీ హక్కుల పోరాట సమితి) రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ రాంబల్‌నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. తండాలను పంచాయతీలుగా చేయాలని 20 ఏండ్లుగా పోరాడామని గుర్తుచేశారు.
3,000కు పైగా తండాలు, గూడేలను తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారని తెలిపారు. పార్టీలకు అతీతంగా తండాల అభివృద్ధే ధ్యేయం గా పనిచేసే మంచి నాయకులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఆయన సూచించారు. ‘మా తండా మారాజ్యం’ నిర్మా ణం కోసం తండాల అభివృద్ధి కోసం కలిసికట్టుగా, పార్టీలకు అతీతంగా ఐక్యతను ప్రదర్శించాలని కోరారు.