రాష్ట్రంపై కేంద్ర వివక్ష తగదు.. ఆగ్రహం వ్యక్తంచేసిన సర్పంచుల సంఘం నాయకులు
Minister Errabelli Dayakar rao | రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ వివక్ష తగదని సర్పంచుల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర నిధులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును
హైదరాబాద్: రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ వివక్ష తగదని సర్పంచుల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర నిధులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును రాష్ట్ర సర్పంచుల సంఘం నాయకులు కలిసిశారు. 15వ ఆర్థిక సంఘం పెండింగ్ బకాయిలపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను, 15వ ఆర్థిక సంఘం నిధులను గత కొద్ది నెలలుగా నిలిపివేసిందని, దీనివల్ల స్థానిక సంస్థల అభివృద్ధి కుంటుపడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు పనులకు బిల్లులు రాకపోవడంతో సర్పంచులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చామన్నారు. వెంటనే ఆ నిధులు వచ్చేలా కేంద్రంపై వత్తిడి తేవాలని విజ్ఞప్తిచేశామన్నారు. ఉపాధి హామీలో మెటీరియల్ కాంపోనెంట్, లేబర్ కాంపోనెంట్ ఆగిపోయాయని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 15వ ఆర్థిక సంఘం నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధులు ఇస్తున్నదని వెల్లడించారు.
కేంద్రం నిధులు నిలిపేసినప్పటికీ రాష్ట్రం మాత్రం నిధులు ఇస్తూనే ఉందన్నారు. రాష్ట్రంపై కేంద్రం ప్రభుత్వం కావాలనే వివక్ష చూపుతున్నదని విమర్శించారు. మంత్రి ఎర్రబెల్లిని కలిసిన వారిలో తెలంగాణ సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు సుర్వి యాదయ్య, బూడిద రామ్‌రెడ్డి, ఉదయశ్రీ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

