హైదరాబాద్ : వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని సరళ సాగర్ గేట్స్(Sarlasagar) తెరుచుకున్నాయి. భారీ వర్షాల(Heavy rain) కారణంగా నీటి ఉధృతి పెరగడంతో ఆటోమేటిక్ సైఫన్ గేట్స్(Siphon gates ) ఓపెన్ అయ్యాయి. ప్రాజెక్టుకు మొత్తం 17 సైఫన్ గేట్స్ ఉంటే ఆదివారం మధ్యాహ్నం వరకు 10 గేట్లు ఓపెన్ అయ్యాయి. సాయంత్రం వరకు నీటి ఉధృతి మరింత పెరిగితే మిగిలిన ఏడు గేట్లు కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది.
కాగా, ఇవాళ, రేపు కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 9 జిల్లాలకు రెడ్ అలర్ట్.. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిం చారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలన్నారు.