హరిత ఉద్యమంలో భాగస్వాములు కావాలి
హరిత ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కూడవెల్లిలో సంతోష్‌కుమార్ పర్యటించగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఆలయ అర్చకులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.
- తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిచెట్టును కాపాడుకుందాం
- గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్
- కూడవెల్లి ఆలయంలో దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డితో కలిసి పూజలు
దుబ్బాక,అక్టోబర్ 9 : హరిత ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కూడవెల్లిలో సంతోష్‌కుమార్ పర్యటించగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఆలయ అర్చకులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. సంతోష్‌కుమార్ మొదట కూడవెల్లి వాగులో నదీజలాలకు, తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో శమీ మొక్క నాటి, గ్రీన్ ఇండియా చాలెంజ్ లోగోను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శమీ వృక్షాన్ని ప్రతి గ్రామం, దేవాలయం, విద్యాలయాల్లో నాటాలని సూ చించారు. విజయానికి గుర్తుగా పూజించే శమీ (జమ్మి) వృక్షాలు అంతరించిపోకుండా చూడాలని కోరారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జమ్మి చెట్టును రాష్ట్ర వృక్షంగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సంతోష్‌కుమార్ హరిత భారత్ కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

