పంతంగి టోల్‌ప్లాజాకి సంక్రాంతి తాకిడి.. రెండు రోజుల్లో 1.20 లక్షల వాహనాలు
Panthangi Toll plaza | సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్నంవాసులు పల్లెబాటపట్టారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌ప్లాజాకి వాహనాల తాకిడీ భారీగా పెరిగింది. రెండు రోజుల్లోనే
హైదరాబాద్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్నంవాసులు పల్లెబాటపట్టారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌ప్లాజాకి వాహనాల తాకిడీ భారీగా పెరిగింది. రెండు రోజుల్లోనే లక్షా 20 వేలకు పైగా వాహనాలు టోల్గేట్ దాటాయి. గురు, శుక్రవారాల్లో రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 1 గంటల వరకు పంతంగి, బీబీనరగ్ టోల్‌ప్లాజా మీదుగా పయణించిన వాహనాల సంఖ్యను రాచకొండ ట్రాఫిక్ పోలీసులు విడుదల చేశారు.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఈ నెల 12న మొత్తం 56,595 వాహనాలు పాస్అయ్యాయి. ఇందులో 42,844 కార్లు ఉండగా 1,300 ఆర్టీసీ బస్సులు, 4,913 ప్రైవేట్ బస్సులు, 7,538 గూడ్స్, ఇతర వాహనాలు ఉన్నాయని తెలిపారు. ఇక శుక్రవారం రాత్రి (13/01/2023) మొత్తం 67,577 వాహనాలు టోల్‌ప్లాజా మీదుగా పయణించాయని చెప్పారు. ఇందులో 53,561 కార్లు, 1,851 ఆర్టీసీ బస్సులు, 4,906 ప్రైవేట్ బస్సులు, 7,259 ఇతర వాహనాలు ఉన్నాయి.
కాగా, హైదరాబాద్-వరంగల్ హైవేపై ఉన్న బీబీనగర్ టోల్గేట్ మీదుగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం 1 గంటవరకు మొత్తం 25231 వాహనాలు పయణించాయని తెలిపారు. ఇందులో 17844 కార్లు, 872 బస్సులు, వరంగల్ వైపు నుంచి హైదరాబాద్‌కు మొత్తం 13,334 వాహనాలు వెళ్లాయని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

