బండికి దిమ్మదిరిగేలా..!
- ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అందుతున్నయన్న స్థానికులు
- మళ్లీ ఏం అడగాలో పాలుపోక బిక్కముఖం వేసిన సంజయ్
స్టేషన్‌ఘన్‌పూర్, ఆగస్టు 20: ప్రజాసంగ్రామ యాత్ర చేసుకొంటూ అలా ముందుకు నడుస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఒక దగ్గర ఆగి ఓ వ్యక్తితో ‘మీ గ్రామానికి గొర్రెలు వస్తున్నయా?’ అని అడిగారు. దానికి వెంటనే అవతలి వ్యక్తి.. ‘వస్తున్నయ్’ అని కట్టె కొట్టె తెచ్చే అన్నట్టు జవాబిచ్చారు. శనివారం రాత్రి 8 గంటలకు జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం మీదికొండలో చోటుచేసుకొన్న సన్నివేశం ఇది. ఆ మాట అన్నది టీఆర్ఎస్ కార్యకర్త కాదు.
అచ్చమైన కాంగ్రెస్ నేత. ఇదొక్కటే కాదు.. తాను ఏ సంక్షేమ పథకంపై ప్రశ్న వేసినా.. వస్తున్నయ్! అని అవతలి నుంచి సమాధానం వస్తుండటంతో మళ్లీ ఇంకో ప్రశ్న అడిగితే ఇజ్జత్ పోతదని బండి సంజయ్ బిక్కమొహం వేస్తున్నారు.
అసహనంతో అక్కడున్న బీజేపీ కార్యకర్తలే స్థానికులపై దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే శనివారంలో మీదికొండలో జరిగింది. కాలువ శ్రీరాములు అనే వ్యక్తి అన్ని పథకాలు వస్తున్నాయని అనటంతో సహనం కోల్పోయిన బీజేపీ కార్యకర్తలు.. అతడిపై దాడికి పాల్పడ్డారు. కాంగ్రెస్ నేత జోగు రాంచందర్పైనా దాడికి ప్రయత్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

