హైదరాబాద్ జనవరి 6 (నమస్తే తెలంగాణ): రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ నూతన డైరెక్టర్‌గా అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సందీప్ శాండిల్య శుక్రవారం పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించారు. 1993 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన ఏడీజీపీ రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ విభాగం నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు.
ఈ సందర్భంగా పూర్వ సంచాలకులు ఏడీజీపీ వీవీ శ్రీనివాస్ తన బాధ్యతలను సందీప్ శాండిల్యకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్లు డాక్టర్ బీ నవీన్‌కుమార్, డాక్టర్ జానకీ శర్మిల, రావుల గిరిధర్, పీఎస్సార్ మూర్తి, రాధేశ్ మురళి తదితరులు పాల్గొన్నారు.