హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో (టీఎస్‌నాబ్) డైరెక్టర్‌గా సందీప్ శాండిల్య బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించిన తర్వాత అదే భవనంలో ఉన్న టీనాబ్ కార్యాలయంలో శాండిల్య బాధ్యతలు స్వీకరించారు. టీనాబ్ ఎస్పీ సునీతారెడ్డి ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.