హైదరాబాద్, ఫిబ్రవరి13 (నమస్తే తెలంగాణ): ఎట్టకేలకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీలోని ఉద్యోగులకు వేతనాలను చెల్లించారు. సొసైటీ పరిధిలోని అన్ని విభాగాల్లో కలిపి మొత్తంగా 7వేల మందికిపైగా టీచింగ్, నాన్‌టీచింగ్ విధులను నిర్వర్తిస్తున్నారు.
దాదాపు 4వేల మందికి ఇప్పటి వరకు వేతనాలను చెల్లించలేదు. ఇదే విషయమై ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ క్రమంలో అధికారులు ఉద్యోగులందరి వేతనాలు విడుదల చేశారు.