ముషీరాబాద్, ఆగస్టు 16: సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఇతర శాఖల్లో మాదిరిగా జీతాలు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లకు మిగతావారిలా నెలకు రూ. 36 వేలు ఇవ్వాలని కోరారు.
ఆదివారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో రాష్ట్ర పార్ట్‌టైమ్-కాంట్రాక్ట్ టీచర్ల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్ట్‌టైమ్, కాంట్రాక్ట్ అధ్యాపకులు గత 15 ఏండ్లుగా చాలీచాలని జీతాలతో పని చేస్తున్నారని అన్నారు. సమాన పనికి సమాన జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు.