కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌కు చెందిన కొంగల సాయికిరణ్ టెన్త్, ఇంటర్ కరీంనగర్లో చదువుకున్నాడు. హాయిగా సాగుతున్న తన జీవితం లో తండ్రికి ఆరేండ్ల కింద పక్షవాతం రావడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. చదువు మానేసి.. తన ఇంటి ముందే నల్లగొండ రోడ్డుకు ఆనుకొని ‘ప్యూర్ వెజ్ స్నాక్స్’ పేరుతో బజ్జీల బండి ఏర్పాటు చేశాడు.
సాయికిరణ్ ఎంబీబీఎస్ చదవాలనుకున్న విషయాన్ని గిరిప్రసాద్ అనే వ్యక్తి తెలుసుకొని శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యానికి తెలిపారు. ఈ మేరకు సాయికిరణ్‌కు అక్కడ నీట్లో ఉచితంగా శిక్షణ ఇచ్చారు. పట్టుదలతో చదివి నీట్లో స్టేట్ ర్యాంకు 5,533 సాధించాడు. ఇటీవలే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య విజ్ఞాన కళాశాలలో అడ్మిషన్ పొందాడు. శ్రీ చైత న్య డైరెక్టర్ కర్ర నరేందర్‌రెడ్డి సాయికిరణ్‌ను అభినందించారు. ప్రతి జిల్లాలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి.. తమ లాంటి నిరుపేద విద్యార్థుల డాక్టర్ కావాలన్న కోరికను నెరవేర్చుతున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామంటూ కృతజ్ఞతలు తెలిపారు.