మహబూబ్నగర్ మెట్టుగడ్డ, నవంబర్ 23 : రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన సాగుతున్నదని.. అందుకు సీఎం రేవంత్రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యనే ప్రత్యక్ష నిదర్శనమని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.
సీఎం స్వగ్రామంలో రేవంత్రెడ్డి సోదరుల వేధింపులతోనే మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై రేవంత్రెడ్డి స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఆయన మరణ వాంగ్మూలాన్నే సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.