Sai Chand | గాయకుడు, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్‌కు బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా తుది వీడ్కోలు పలికాయి. గుండెపోటుతో అర్ధరాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. వనస్థలీపురం సాహెబ్‌నగర్ శ్మశాసనవాటికలో సాయిచంద్ అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలకు మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు, కళాకారులు హాజరై ఘన నివాళులర్పించారు. సాయి చంద్ బుధవారం సాయంత్రం కుటుంబీకులతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లాలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లాడు.
అర్ధరాత్రి సమయంలో గుండెపోటు రావడంతో నాగర్ కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తరలించగా.. గురువారం తెల్లవారు జామున 3 గంటలకు కన్నుమూశారు. ఆ తర్వాత పార్థీవ దేహాన్ని రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో ఉన్న ఆయన స్వగృహానికి తరలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, శ్రీనివాస్ యాదవ్ సహా సాయి చంద్‌కు నివాళులర్పించి.. కుటుంబాన్ని ఓదర్చారు. సాయి చంద్ భార్య, పిల్లలు బోరున విలపించగా.. సీఎం కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.