హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): టీజీ జెన్కో డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) ఎం సచ్చిదానందంకు జలవిద్యుత్తు (హైడల్) డైరెక్టర్ బాధ్యతలను అప్పగించారు. కొత్త డైరెక్టర్ నియమితులయ్యే వరకు బాధ్యతల్లో కొనసాగాలని టీజీ జెన్కో సీఎండీ రోనాల్డ్ రోస్ ఉత్తర్వులను జారీచేశారు.
ఇవి కూడా చదవండి
రాజీవ్త్రన్ కుమారుడికి ఉద్యోగం
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : దివంగత ఐపీఎస్ అధికారి రాజీవ్త్రన్ కుమారుడు హరిరతన్‌కు గ్రూప్ -1 స్థాయి గ్రేడ్ -2 మున్సిపల్ కమిషనర్‌గా ఉద్యోగం కల్పిస్తూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజీవ్త్రన్ ఉద్యోగంలో ఉండగా ఆకస్మికంగా మరణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
86 మందికి.. 86 శాతం ఫీజు రాయితీ
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): రతన్‌టాటాకు నివాళిగా హైదరాబాద్‌లోని విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యాజమాన్యం 86 మంది విద్యార్థులకు 86శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని నిశ్చయించింది. 2024 -25 విద్యాసంవత్సరంలో చేరే విద్యార్థులకు ఈ అవకాశం కల్పించనున్నట్టు విద్యాసంస్థల చైర్మన్ చిట్టా నిర్మల్‌కుమార్ తెలిపారు.