బడంగ్‌పేట, సెప్టెంబర్12: మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీ సబి తా ఇంద్రారెడ్డి మానవత్వం చాటుకున్నా రు. మహేశ్వరం నియోజక వర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాదర్‌గూల్‌లో ఉన్న మాతృదేవో భవ అనాథాశ్రమ భవన నిర్మాణానికి సబితా ఇంద్రారెడ్డి ఒకనెల ఎమ్మెల్యే వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. తమ ఆశ్రమానికి సాయం చేయాలని, ఆశ్రమాన్ని సందర్శించాలని యజమాని గట్టు గిరి విజప్తి మేరకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సూచన మేరకు బీఆర్ఎస్ నేతలు పటోళ్ల కౌశిక్‌రెడ్డికి నేతృత్వంలో బీఆర్ఎస్ నేతలు ఆ అనాథాశ్రమాన్ని పరిశీలించారు. రెండు రోజుల్లో ఎమ్మెల్యే స్వయంగా ఆశ్రమానికి వచ్చి విరాళాన్ని అందజేస్తారని వారు తెలిపారు. అ ఈ సందర్భంగా విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి ఆశ్రమ నిర్వాహకుడు గట్టు గిరి కృతజతలు తెలిపారు. బీఆర్ఎస్ బడంగ్పేట్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు అర్కల కామేశ్‌రెడ్డి, నాయకులు కుమార్, జంగయ్య, నరేశ్, శ్రీనునాయక్, మైపాల్‌గౌడ్, టేకు ల భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.