హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రకటించిన రైతు భరోసా పథకం ఓ ఫూలిష్ పథకమని రెడ్కో చైర్మన్ సతీశ్‌రెడ్డి వి మర్శించారు. ఈ పథకాన్ని ఏ విధం గా అమలు చేస్తారో వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కౌలు రైతులు, కూలీలను ఏ విధంగా గుర్తిస్తారు..? సాయం ఎలా చేస్తారు? అనేది చెప్పాలని అడిగారు. కాంగ్రెస్ విధానాన్ని పరిశీలిస్తే అమలుకు సాధ్యం కాని పథకాన్ని ప్రకటించిందని విమర్శించారు. ఇది రైతులను మోసం చేయడమే తప్పా మరేమీ లేదని చెప్పారు.