హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు మొద్దునిద్రలో ఉన్నారని బీఆర్ఎస్ నేతలు కే వాసుదేవరెడ్డి, బాలరాజుయాదవ్ ధ్వజమెత్తారు. హైడ్రా పేరిట ప్రజాసమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. హైదరాబా ద్ తెలంగాణ భవన్లో గురువారం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. గురుకులాల్లో పరిస్థితులు దారుణంగా ఉ న్నాయని, రేవంత్ సరార్ ప్రభుత్వ గురుకుల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నదని వా సుదేవరెడ్డి ఆరోపించారు. ఇప్పటివరకు 38 మంది గురుకుల విద్యార్థులు వివిధ కారణాలతో చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా సీఎం, మంత్రులకు చీమ కుట్టినట్టయినా లే దని ఆరోపించారు. చాలా రోజుల నుంచి తాము గురుకులాల స్థితిగతుల గురించి హెచ్చరిస్తూనే ఉన్నామని తెలిపారు. ఇలా ఎంతకాలం విద్యార్థులు బాధపడాలని ప్రశ్నించారు. ప్రజాపాలన పడకేసిందని మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి గురుకులాల వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారని బాలరాజు యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ హాయంలో గురుకులాలను కంటికి రెప్పలా కాపాడుకున్నారని తెలిపారు. రాష్ట్రానికి శనిలా రేవంత్ పాలన దాపురించిందని, ముందు ప్రజాసమస్యల పరిషారం గురించి ఆలోచించాలని హితవు పలికారు.