కథలాపూర్, సెప్టెంబర్ 30 : చదువుకొనేందుకు తాను పడ్డ కష్టాలు మరెవరూ పడకూడదని తలంచింది జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్య్రాల గ్రామానికి చెందిన అనాథ యువతి రుద్ర రచన. మంత్రి కేటీఆర్ సహకారంతో బీటెక్ పూర్తి చేసిన ఆమె సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా స్థిరపడింది. తన గ్రామానికి చెందిన సాదుల రంజిత్ అనే పేద ఇంజినీరింగ్ విద్యార్థి చదువు కోసం రచన రూ.12 వేల ఆర్థిక సాయాన్ని శనివారం అందజేసింది. రుద్ర రచన ఇటీవలే సీఎంఆర్ఎఫ్కు రూ.లక్ష విరాళాన్ని అందించిన విషయం తెలిసిందే.