హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : సమాచార హకు చట్టం-2025లో భాగంగా ఉత్తమ పనితీరు కనపరిచిన విభాగాధిపతిగా ఎక్సైజ్ శాఖ కమిషనర్‌కు ఈ ఏడాది పురస్కారం దక్కింది. ఈ అవార్డును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హైకోర్టు న్యాయమూర్తి చేతుల మీదుగా ఎక్సైజ్‌శాఖ కమిషనర్ చెవ్వూరి హరికిరణ్ అందుకున్నారు. ఐదేండ్లలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నుంచి సమాచార హకు కింద.. వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిషరించినందుకు ఆయనకు ఈ అవార్డు వచ్చింది.
ఈ సందర్భంగా హరికిరణ్ మాట్లాడుతూ వచ్చిన అవార్డును ఎక్సైజ్ శాఖ ఉద్యోగులందరికీ అంకితమిస్తున్నట్టు పేరొన్నారు. ఈ అవార్డు ఎక్సైజ్ శాఖకు రావడం ఎంతో సంతోషంగా ఉందని.. ఇక ముందు కూడా ఆర్టీఐ కింద అడిగిన సమాధానం త్వరతగతిన ఇవ్వడంలో కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.