పోరాటాలతోనే సర్కార్ దిగొచ్చింది
కార్మికుల పోరాటం, శంకర్‌గౌడ్ ప్రాణత్యాగం వల్లే ప్రభుత్వం దిగొచ్చిందని ఆర్టీసీ కార్మిక జేఏసీ పేర్కొన్నది. ప్రభుత్వంతో జరిగిన చర్చలు, కార్మికుల పోరాటాలను కొనియాడుతూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
- రెండున్నరేండ్లుగా అనేక ఉద్యమాలు చేశాం
- ఆర్టీసీ కార్మిక జేఏసీ
హైదరాబాద్, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ) : కార్మికుల పోరాటం, శంకర్‌గౌడ్ ప్రాణత్యాగం వల్లే ప్రభుత్వం దిగొచ్చిందని ఆర్టీసీ కార్మిక జేఏసీ పేర్కొన్నది. ప్రభుత్వంతో జరిగిన చర్చలు, కార్మికుల పోరాటాలను కొనియాడుతూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. జేఏసీ ఆధ్వర్యంలో రెండున్నరేండ్ల నుంచి అనేక ఉద్యమాలు చేశామని, ఉద్యమ కార్యాచరణ ఫ లితంగానే పోరాటం సఫలీకృతమైందని జే ఏసీ నేతలు పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన చర్చల్లో యూనియన్ కార్యకలాపాల ను అనుమతించి గుర్తింపు సంఘ ఎన్నిక లకు అంగీకరించారని చెప్పారు.
2021 వే తన సవరణ 11శాతానికి పెంచేందుకు అంగీకరించడంతో ఈనెల 1వ తేదీ నుంచే దానిని అమలు చేయడం, ఏరియర్స్ రిటైర్మెంట్ తర్వాత ఇవ్వడానికి అంగీకారం చె ప్పారని పేర్కొన్నారు. బ్రెడ్ విన్నర్ సీమ్ ద్వారా రెగ్యులర్ ప్రతిపాదికన ఉద్యోగాలు ఇవ్వడానికి అంగీకరించారని, ఆ పథకం కింద జాయిన్ అయిన తేదీ నుంచి రెగ్యులర్ ఉద్యోగులుగా ఉండటానికి ప్రభుత్వం అంగీకరించినట్టు తెలిపారు. సమ్మెలో పా ల్గొన్న బ్రెడ్ విన్నర్ సీమ్, ఔట్సోర్సింగ్, రెగ్యులర్ ఉద్యోగులందరినీ షరతులు లే కుండా విధుల్లోకి తీసుకోవాలని ఆదేశిస్తూ సమ్మె చేసిన కాలానికి కూడా జీతం చెల్లించాలని యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించిందని జేఏసీ నేతలు పేర్కొన్నారు.
శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటాం
అమరుడు శంకర్‌గౌడ్ కుటుంబానికి జేఏసీ నేతలు ప్రగాఢ సంతాపం తెలిపి సానుభూతి ప్రకటించారు. వా రి కుటుంబానికి అన్ని విధాలుగా స హాయ సహకారాలు అందిస్తామని తె లిపారు. చర్చల సందర్భంగా మంత్రులతో ఎప్పటికప్పుడు సమస్యల పరిషారం కోసం కృషి చేసిన సీపీఐ ఎ మ్మెల్యే కూనంనేని, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, మీడియా, ఎస్‌డబ్ల్యూఎఫ్, టీజేఎంయూ, ఇతర యూ నియన్లకు ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

