హైదరాబాద్ జూన్ 21 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ పీఎఫ్ ఖాతాలను స్తంభింపజేస్తూ మార్చి 21న ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఆర్టీసీ ఖాతాల స్తంభన ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 15కు వాయిదా వేసింది.