కండక్టర్ ప్రవళికకు ఆర్టీసీ అండ : ఈడీ వెంకన్న
ప్రయాణికురాలి దాడితో గాయపడిన కండక్టర్ ప్రవళికకు ఆర్టీసీ అండగా ఉంటదని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకన్న తెలిపారు. నిందితురాలిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : ప్రయాణికురాలి దాడితో గాయపడిన కండక్టర్ ప్రవళికకు ఆర్టీసీ అండగా ఉంటదని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకన్న తెలిపారు. నిందితురాలిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్ చికిత్సపొందుతున్న మణుగూరు డిపో ఆర్టీసీ మహిళా కండక్టర్ ప్రవళికను వెంకన్న సోమవారం పరామర్శించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల రక్షణకు యాజమాన్యం ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నదని తెలిపారు. కాగా, ప్రవళికను ఆర్టీసీ కార్మిక నేతలు హనుమంతు ముదిరాజ్, అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వీఎస్‌రావు, కత్తుల యాదయ్య తదితరులు పరామర్శించారు.
కొనసాగుతున్న మిషన్ భగీరథ ఇంజినీర్ల నిరసన
హైదరాబాద్, అక్టోబర్26 (నమస్తే తెలంగాణ) : మిషన్ భగీరథ విభాగంలో ప్రమోషన్లు కల్పించి తక్షణం పనిభారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీఆర్డబ్ల్యూఎస్ఈఏ (తెలంగాణ రూరల్ వాటర్ సప్లయ్ ఇంజినీర్స్ అసోసియేషన్) ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా భోజన విరామ సమయంలో ఇంజినీర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటపతి, ప్రధాన కార్యదర్శి రాజు మాట్లాడుతూ ఉద్యోగోన్నతుల ప్రక్రియ నిలిచిపోవడం వల్ల అర్హులైన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని పేరొన్నారు. ఈఎన్సీ కార్యాలయంలోనే జాప్యం జరుగుతున్నదని, తక్షణం ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

