హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని టీజీఎస్ ఆర్టీసీ జాక్ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆర్టీసీ జాక్ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి ఆధ్వర్యంలో కో-కన్వీనర్ ఎండీ మౌలానా,యాదయ్య, సురేశ్, యాదగిరిలతో కలిసి శుక్రవార ం సచివాలయంలో సీఎస్ శాంతికుమారిని కలిసి వినతిపత్రం అందజేశారు.
టీఎన్జీవో జాక్‌లో టీజీఎస్ ఆర్టీసీ జాక్ చేరింది. హైదరాబాద్‌లోని టీఎన్జీవో కార్యాలయంలో జేఏసీ చైర్మన్ జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావులతో ఆర్టీసీ జేఏసీ చైర్మన్, వైస్ చైర్మన్, ఇతర నాయకులు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీఎన్జీవో జాక్ చైర్మన్ ఎం.జగదీశ్వర్, శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, ఇతర సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ జాక్‌కు సహకరిస్తామని ప్రకటించారు. అనంతరం రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌ని కలిసి ఉద్యోగుల వివరాలను అందజేశారు.