కరీంనగర్: కరీంనగర్లో (Karimnagar) అద్దె బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు బస్సుల్లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ అద్దెబస్సు డ్రైవర్‌కు డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించగా అందులో మద్యం సేవించినట్లు తేలింది. అయితే తాను మందు తాగలేదని, అసలు తనకు మద్యం సేవించే అలవాటే లేదని అధికారులకు తేల్చిచెప్పాడు. అయినా అతడిని డ్యూటీకి అధికారులు అనుమతించకపోవడంతో.. అద్దె బస్సుల డ్రైవర్లంతా కలిసి కరీంనగర్ బస్టాండ్‌లో ఆందోళనకు దిగారు.
దీంతో బస్సుల బస్స్టాండ్లోనే నిలిచిపోయాయి. ప్రైవేటు బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కోసం రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు.