RTC Driver | ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడిన డ్రైవర్ కోల శంకర్ గౌడ్(55) మృతదేహం తన అల్లుడి స్వగ్రామమైన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటకు చేరుకుంది. హైదరాబాద్ కంచన్‌బాగ్ డీఆర్డీవో ఆస్పత్రి నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు. ఇవాళ మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ముత్తోజిపేటలో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ఇవాళ ప్రభుత్వంతో చర్చలకు వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. శంకర్ గౌడ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ద్వితీయ శ్రేణి జేఏసీ నేతలు వెళ్తారని పేర్కొన్నారు.