హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణించే వారికి ఆర్టీసీ ప్రత్యేక రాయితీ కల్పించినట్టు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు. లహరి-నాన్ ఏసీ స్లీపర్కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10%, రాజధాని ఏసీ బస్సుల్లో 8% రాయితీ ఇస్తున్నట్టు వెల్లడించారు. ప్రయాణికులు సద్వినియో గం చేసుకోవాలని ఆయన కోరారు. ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tgsrtcbus.in వెబ్సైట్ని సందర్శించాలని సూచించారు.