RTC Bus | జగిత్యాల రూరల్, ఆగస్టు 17: ఆర్టీసీ బస్సు పరిమితి 47 మంది కాగా.. శనివారం ఏకంగా 170 మంది ప్రయాణికులను ఎక్కించుకొని డ్రైవర్, కండక్టర్ జగిత్యాల నుంచి ప్రయాణికులతో నిర్మల్‌కు వస్తున్నారు. ఓవర్ లోడ్ కారణంగా జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి శివారుకు చేరుకోగానే.. బస్సు వెనుక రైట్ సైడ్ రెండు టైర్లు ఊడిపోయాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. పరిమితికి మించి ఎక్కించుకొని తీసుకెళ్లడంపై మండిపడుతున్నారు. అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని, వెంటనే అదనపు బస్సులు నడిపించాలని డిమాండ్ చేస్తున్నారు.